పర్యాటక రంగంపై అవగాహన ఉండాలి : వరంగల్‌‌ కలెక్టర్‌‌ ప్రావీణ్య

కాశీబుగ్గ, వెలుగు : పర్యాటక రంగం, చరిత్రపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన ఉండాలని వరంగల్‌‌ కలెక్టర్‌‌ ప్రావీణ్య సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖిలా వరంగల్‌‌లో బల్దియా కమిషనర్‌‌ రిజ్వాన్‌‌ బాషాతో కలిసి హెరిటేజ్‌‌ వాక్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన చారిత్రక సంపద ఉందన్నారు.

ప్రతీ ఒక్కరూ చరిత్ర, సంస్కృతి తెలుసుకోవాలని సూచించారు. 27వ తేదీ వరకు పర్యాటక దినోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శివాజీ, బొమ్మినేని రవీందర్‌‌రెడ్డి, తహసీల్దార్‌‌ నాగేశ్వరరావు, శ్రీనివాస్‌‌రావు, కార్పొరేటర్లు సువర్ణ, ఉమా, లీడ్‌‌ బ్యాంక్‌‌ మేనేజర్‌‌ రాజు, శ్రీనివాస్, రవి యాదవ్, లోకేశ్‌‌, ఖాదర్‌‌ పాషా, బాషా, అజయ్‌‌ పాల్గొన్నారు.