ఖిలా వరంగల్ (కరీమాబాద్), వెలుగు : నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇత్తడి నగిశీ కళాకారులకు ప్రోత్సాహం అందించే ప్రాజెక్ట్‌ను రూపొందించడం అభినందనీయం అన్నారు.
కళాకారుల కోసం చేపట్టిన కార్యక్రమాన్ని వినియోగించుకొని, స్కిల్స్ పెంచుకోవాలని చెప్పారు. సమావేశంలో నాబార్డ్ సీజీఎం సుశీల చింతల, ఏజీఎంలు రవి, చంద్రశేఖర్, పరిశ్రమల శాఖ అధికారి నరసింహమూర్తి, మారి సంస్థ వైస్ చైర్మన్ హేమనళిని, అధ్యక్షుడు మారపాక వెంకట్, రంగశాయిపేట ఇత్తడి నగిసి కళాకారుల సొసైటీ ప్రెసిడెంట్ ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.