ఇందిరమ్మ ఇండ్ల పనులను స్పీడప్​ చేయండి : కలెక్టర్​ సత్యశారద

ఇందిరమ్మ ఇండ్ల పనులను స్పీడప్​ చేయండి : కలెక్టర్​ సత్యశారద

 

 

  • వరంగల్​జిల్లా కలెక్టర్​సత్యశారద

నల్లబెల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్పీడప్​ ఈwచేయాలని వరంగల్​ జిల్లా కలెక్టర్​ సత్యశారద ఆదేశించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రామతీర్థంలో చేపడుతున్న ఇండ్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఇన్​ టైమ్​లో కంప్లీట్​ చేయాలని సూచించారు.

 ఈ నెల 31లోపు బేస్‌మెంట్ లెవెల్ పూర్తి చేస్తే లబ్ధిదారుల ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామన్నారు.  మండుతున్న ఎండల వల్ల  గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తె  ప్రమాదం ఉందన్నారు. ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికలు చేయాలని సూచనలు చేశారు. నారక్కపేట గ్రామంలో మిషన్ భగీరథ పంప్ హౌజ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పా కృష్ణ,  ఎస్సై గోవర్ధన్ వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.