![నెక్కొండ కుల బహిష్కరణపై..బీసీ కమిషన్‌కు రిపోర్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/warangal-collector-submits-report-to-bc-commission-on-nekkonda-caste-expulsion_QjDGSFLmk9.jpg)
- కుల పెద్దలతో రాజీ కుదిర్చామని కలెక్టర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారంలో కుల బహిష్కరణపై బీసీ కమిషన్‌కు వరంగల్ కలెక్టర్ రిపోర్ట్ అందజేశారు. ‘9 నెలలుగా కులానికి దూరం పెట్టిండ్రు’ అని గత నెల 29న ‘వెలుగు’ దినపత్రికలో పబ్లిష్ అయిన కథనాన్ని బీసీ కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై నివేదిక ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సోమవారం బీసీ కమిషన్‌కు కలెక్టర్ సత్య శారద నివేదిక ఇచ్చారు. కుల బహిష్కరణపై నెక్కొండ తహసీల్దార్, ఏసీపీ, సీఐతో పాటు అధికారులు కుల పెద్దలతో కలిసి బహిష్కరణకు గురైన 14 కుటుంబాలకు ఈ అంశంపై అవగాహన కల్పించామని రిపోర్ట్‌లో కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో కుల పెద్దలు అంగీకరించి, రాజీకి వచ్చారని చెప్పారు.