ఎలక్షన్‌‌‌‌ డ్యూటీలో నిర్లక్ష్యం వద్దు :అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా

ఆత్మకూరు, వెలుగు : ఎలక్షన్‌‌‌‌ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండొద్దని వరంగల్ సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా హెచ్చరించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పోలీస్‌‌‌‌ చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ను, పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ను గురువారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి డిజిటలైజేషన్‌‌‌‌ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు, కటాక్షపూర్‌‌‌‌లోని పోలింగ్‌‌‌‌ కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట పరకాల ఏసీపీ కిశోర్‌‌‌‌కుమార్‌‌‌‌, ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ రవికుమార్, ఎస్సైలు ప్రసాద్‌‌‌‌, రాజేశ్‌‌‌‌రెడ్డి ఉన్నారు. ఆత్మకూరు జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌లోని పోలింగ్‌‌‌‌ కేంద్రానికి వెళ్లిన సీపీకి స్టూడెంట్లు కనిపించడంతో వారితో కొద్దిసేపు మాట్లాడారు.