జనగామ అర్బన్, వెలుగు : వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సోమవారం అర్ధరాత్రి జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ సిబ్బంది వాహానాల తనిఖీలు తీరును సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
చెక్పోస్ట్ సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ జనగామ రైల్వే స్టేషన్ లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ సీఐ శ్రీనివాస్ యాదవ్, ఎస్సై స్వేత, బీఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.