రాత్రి కూడా పోలీసులు అందుబాటులో ఉండాలి : సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝూ

పర్వతగిరి (సంగెం, గీసుగొండ), వెలుగు : రాత్రి వేళల్లోనూ పోలీస్‌‌‌‌ సిబ్బంది స్టేషన్లలో అందుబాటులో ఉండాలని వరంగల్‌‌‌‌ సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝూ ఆదేశించారు. వరంగల్‌‌‌‌ జిల్లా సంగెం, గీసుగొండ పోలీస్‌‌‌‌స్టేషన్లను శుక్రవారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్‌‌‌‌ స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు.

అనంతరం స్టేషన్‌‌‌‌లో పనిచేస్తున్న ఆఫీసర్లు, సిబ్బంది వివరాలు, రాత్రి వేళల్లో డ్యూటీ చేసే సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ముమ్మరంగా పెట్రోలింగ్‌‌‌‌ నిర్వహించాలని సూచించారు. డ్యూటీలో అలసత్వం వహించొద్దని, నిరంతరం అపమ్రత్తంగా ఉండాలని చెప్పారు.