మైనింగ్ ​మాఫియాపై కఠిన చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

మైనింగ్ ​మాఫియాపై కఠిన చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

వర్ధన్నపేట, వెలుగు : అక్రమ మైనింగ్​ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, కొత్తపల్లి గ్రామాల్లోని ఆకేరు వాగు పరివాక ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఆయన పరిశీలించారు. సీఐ శ్రీనివాస్​ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సీపీ మీడియాతో మాట్లాడుతూ అక్రమ మైనింగ్ జరుగకుండా స్పెషల్​ టీంను ఏర్పాటు చేస్తామని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్​ పెంచుతామన్నారు. సీపీ వెంట ఏసీపీ నర్సయ్య, ఎస్సై చందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మత్తుకు బానిసై భవిష్యత్​ను చిత్తు చేసుకోవద్దు

కాశిబుగ్గ(కార్పొరేషన్): యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్​ను చిత్తు చేసుకోవద్దని వరంగల్​ సీపీ అంబర్​ కిషోర్​ ఝా సూచించారు. బుధవారం తెలంగాణ స్టేట్​ జర్మలిస్ట్​ యూనియన్​ వరంగల్​ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పోచమ్మమైదాన్ నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు 2కే రన్​ నిర్వహించారు.

కార్యక్రమాన్ని సీపీ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, టీఎస్ జేయూ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగోని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్​తో కలిసి ప్రారంభించారు.