ఫ్యామిలీ కోసమైనా హెల్మెట్‌ ధరించండి : సీపీ అంబర్​ కిశోర్​ ఝా

ఫ్యామిలీ కోసమైనా హెల్మెట్‌ ధరించండి : సీపీ అంబర్​ కిశోర్​ ఝా

హనుమకొండ, వెలుగు: ఫ్యామిలీ భద్రత కోసమైనా బైకర్లు హెల్మెట్ ధరించి బండ్లు నడపాలని వరంగల్ సీపీ అంబర్​ కిశోర్​ ఝా సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ డా.పుప్పాల శ్రీనివాస్​ ఆధ్వర్యంలో బైక్​ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోలీస్​హెడ్ క్వార్టర్స్ నుంచి ఎంజీఎం వరకు ఈ ర్యాలీ సాగగా, సీపీ అంబర్​ కిశోర్​ ఝా జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌, అడిషనల్​డీసీపీ సురేశ్​కుమార్‌, ఏసీపీలు సత్యనారాయణ, నాగయ్య, ఆర్‌ఐలు స్పర్జన్‌ రాజ్‌, సతీశ్, చంద్రశేఖర్, ఎంవీఐలు వేణుగోపాల్, కిశోర్​బాబు, రమేశ్​ రాథోడ్​ తదితరులు పాల్గొన్నారు.