నర్సంపేట, వెలుగు : నర్సంపేట మండలం మహేశ్వరం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును వరంగల్ సీపీ అంబర్ కిశోర్‌ఝా మంగళవారం తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే నాలుగు ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
సీపీ మహేశ్వరం చెక్‌పోస్టును తనిఖీ చేసి చెక్‌పోస్టు పనితీరును పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు సూచనలు ఇచ్చారు