హసన్‌పర్తి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశించారు. కేయూసీ సెనెట్ హాల్‌లో శుక్రవారం పోలీస్ ఆఫీసర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ఓటర్లకు ను డబ్బులు, మద్యం, బహుమతులను పంపిణీ చేస్తూ దొరికితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి,
ఏ సెక్షన్లు నమోదు చేయాలి, చెక్ పోస్టుల ఏర్పాటు, డబ్బులు, మద్యం పంపిణీ నివారణకు చేపట్టాల్సిన చర్యలు, గంజాయి, నాటుసారా, పటిక నియంత్రణ, రౌడీ షీటర్ల బైండోవర్ల వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో డీసీపీలు దాసరి మురళీధర్, రవీందర్, అబ్దుల్ బారి, సీతారాం, అడిషనల్ డీసీపీలు రాగ్యానాయక్, సంజీవ్, సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.