
ఖిలా వరంగల్ లో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పెట్రోల్ పంపు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధులను క్రెయిన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు సుమతి(70) అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త కాల్వ బాలరాజు(78) పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు బాలరాజును ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే క్రెయిన్ డ్రైవర్ క్రెయిన్ ను అక్కడే వదిలేసి పారిపోయాడు.