వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి డీసీసీబీ చైర్మన్

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.  రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. అనంతరం  గాంధీ భవన్ లో  ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు వేములవాడలో ఐదుగురు కౌన్సిలర్లను బీఆర్ఎస్ సస్పెండ్‌ చేసింది. వైస్‌ఛైర్మన్‌ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కౌన్సిలర్లు ఓటేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడినందుకు జయ, శ్రీనివాసరావు, లక్ష్మీ, సనంద, రాజేందర్‌ శర్మ లను  సస్పెండ్ చేసింది.  

ALSO READ :- తగ్గుతున్న నీటి నిల్వలు..  ఏపీకి నీటి గండం తప్పదా..?