
వరంగల్ జిల్లా లో దొంగలు రెచ్చిపోయారు. వరంగల్ రాంకీలో ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో సామాను చిందరవందర చేసి బీరువా లాకర్ పగులకొట్టి 8తులాల బంగారం 70 వేల రూపాయిలను అపహరించారు. ఇంటి యజమాని నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. .