
ఎమ్మార్వో ఆఫీసులో చోరీ జరిగింది. డిప్యూటీ ఎమ్మార్వో కంప్యూటర్ ను కొట్టేశాడో దొంగ. అర్థరాత్రి ఎమ్మార్వో కార్యాలయంలోకి చొరబడిన రాజు అనే చోరీగాడు..డిప్యూటీ తహశీల్దార్ టేబుల్ పై ఉన్న కంప్యూటర్ ను అపహరించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట తహశీల్దారు కార్యాలయంలోకి రాజు అనే వ్యక్తి అర్థరాత్రి ప్రవేశించాడు. డిప్యూటీ తహశీల్దార్ టేబుల్ పై ఉన్న కంప్యూటర్ ను ఎత్తుకెళ్లాడు. అయితే పొద్దున సిబ్బంది వచ్చే సరికి కంప్యూటర్ లేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా చోరీ జరిగిందని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..కంప్యూటర్ ను రికవరీ చేసి ఎమ్వార్వో కార్యాలయంలో అప్పగించారు.