వరంగల్ సిటీ/ కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ జిల్లా గీసు గొండ మండలం హట్యాతండా దగ్గర ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై సోమకుమార స్వామి (56) చనిపోయారు. భద్రాద్రి జిల్లా డీసీఆర్బీ లో ఆయన ఎస్సైగా పనిచేస్తున్నారు. తన సొంతూరు వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం అనంతారానికి కారులో వెళ్తుండగా వెహికల్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.