వరంగల్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్ళే గూడ్స్ రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. దీంతో కిలోమీటర్ పైగా ముందుకు వెళ్లిన బోగీ.. మళ్ళీ వెనక్కి వచ్చి మరో బోగీకి తగిలింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై లోకో పైలెట్ కి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న లోకో పైలెట్ ఘటనాస్థలికి చేరుకుని రైల్వే సిబ్బందితో కలసి వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.