ఉమ్మడి వరంగల్ లో ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది. ఎంపీటీసీ ఎన్నికల్లో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో టీఆర్ఎస్ – కాంగ్రెస్ పోటీపోటీగా నిలిచినా.. అధికార పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. 780 ఎంపీటీసీ స్థానాలకు 531 చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ 186 చోట్ల గెలవగా… కమ్యూనిస్టు పార్టీలు రెండు ఎంపిటీసీ స్థానాలతో సరిపెట్టుకున్నారు.
వరంగల్ పార్లమెంట్, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్ఎస్… ప్రాదేశిక ఏన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగించింది. ఉమ్మడి వరంగల్ పరిధిలో ఆరు జిల్లాల్లో 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా… 531 ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ సాధించుకుంది. కాంగ్రెస్ 186 చోట్ల విజయం సాధించగా.. బీజేబీ 3, సీపీఐ, సీసీపీఎం1, ఫార్వర్ బ్లాక్ 7 స్థానాలతో కలిసి ఇతరులు 63 చోట్ల ఎంపిటీసీలుగా గెలుపొందారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఫలితాలు ఇలా ఉన్నాయి
- వరంగల్ అర్బన్ జిల్లాలో 86 ఎంపీటీసీల్లో 64 టీఆర్ఎస్, 11 కాంగ్రెస్, 11 ఇతరులు గెలుపొందారు.
- వరంగల్ రూరల్ జిల్లాలోని 178 ఎంపీటీసీల్లో 129 టీఆర్ఎస్, 43 కాంగ్రెస్, 06 ఇతరులు గెలిచారు.
- మహబూబాబాద్ లో 198 ఎంపీటీసీల్లో 128 టీఆర్ఎస్, 52 కాంగ్రెస్, 18 ఇతరులు గెలుపొందారు.
- జనగామ జిల్లాలో 140 ఎంపీటీసీల్లో 96 టీఆర్ఎస్, 32 కాంగ్రెస్, 12 ఇతరులు గెలిచారు.
- జయశంకర్ జిల్లాలోని 106 ఎంపీటీసీల్లో 66 టీఆర్ఎస్ 25 కాంగ్రెస్ 15 ఇతరులు గెలిచారు.
- ములుగు జిల్లాలోని 72 ఎంపీటీసీల్లో 48 టీఆర్ఎస్, 23 కాంగ్రెస్, 01 ఇతురులు గెలిచారు.
వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి , మలుగు జిల్లాల్లో అత్యధిక ఎంపిపీలతో… టీఆర్ఎస్ కు అనుకూలంగా నిలిచాయి. మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా ఎంపీటీసీ ఫలితాలు ఎక్కువ మండలాల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
ఐతే గత మూడు నాలుగు రోజులుగా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ముందుగానే గెలుపుకు అవకాశం ఉన్న వారందరితో టచ్ లో ఉండడంతో పాటు… కొందరిని క్యాంప్ కు తరలించారు. ఫలితాలు రావడంతో ఓడిపోయిన కొందరిని తిరిగి ఇంటికి పంపించగా.. గెలిచిన వారిని క్యాంప్ కు తరలిస్తున్నారు. అందుకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకుంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లావ్యాప్తంగా 11 జడ్పిటిసి స్థానాలకు ఫార్వాడ్ బ్లాక్ పార్టీ ఏడు చోట్ల విజయంసాధించింది. ఇక సీపీఎం, సీపీఐ పార్టీలు ఒక్కో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.