నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హైస్కూల్లో ఆదివారం శాంతిసేన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి పాడిపశువుల అందాల పోటీలు జరిగాయి.
జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతులు తమ ఎడ్లు, పాడిగేదెలు, లేగదూడెలు, పొట్టేళ్లు, కోళ్లు, కుందేళ్లు, కుక్కలను ముస్తాబు చేసి పోటీలకు తెచ్చారు. విజేతలకు అతిథులు షీల్డులు, నగదు బహుమతులను అందజేశారు.