పీహెచ్ సీలో నిద్రపోయిన డాక్టర్

పీహెచ్ సీలో నిద్రపోయిన డాక్టర్
  • వాట్సప్ లో ఫొటో షేర్ చేయగా.. వెళ్లి నిలదీసిన ప్రజలు
  • పర్మినెంట్ డాక్టర్ లేకపోవడంతో నెలకొకరు విధులు
  • పీహెచ్ సీ పరిధిలో ప్రజలకు సరిగా అందని వైద్య సేవలు 

రాయపర్తి, వెలుగు: వరంగల్​జిల్లా రాయపర్తి పీహెచ్ సీలో పేషెంట్లను నిల్చోబెట్టి డ్యూటీ డాక్టర్ నిద్రపోవడం వివాదస్పదంగా మారింది. మంగళవారం విధులకు వెళ్లిన డాక్టర్​ప్రతిక్​కుర్చీలో నిద్రపోతుండగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫొటో తీసి వాట్సప్​గ్రూప్​ల్లో షేర్​చేశాడు. దీంతో పలు సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పీహెచ్ సీ వద్దకు వెళ్లి డాక్టర్ ను  నిలదీశారు. పేషెంట్లకు వైద్యసేవలు అందించాల్సింది నిద్రపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.

 దీనిపై డాక్టర్​ను వివరణ కోరగా ఆస్పత్రికి ఎక్కువమంది రోగులు రావడంతో కొంత అలసటగా ఉండడంతో  కుర్చీలో వాలిపోగా ఎవరో వ్యక్తి ఫొటో తీశారని చెప్పారు.  తాను నిద్రపోలేదని పీహెచ్ సీకి వచ్చిన పేషెంట్లకు వైద్య పరీక్షలు చేసి మెడిసిన్ ఇచ్చినట్టు తెలిపారు. కాగా రాయపర్తి పీహెచ్​సీకి పర్మినెంట్​డాక్టర్ లేకపోవడంతో నెలకొకరు తాత్కాలికంగా డ్యూటీ చేస్తున్నారు. దీంతో   సకాలంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నామని పలువురు పేషెంట్లు తెలిపారు.