వర్ధన్నపేట, రాయపర్తి, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్న పేట, రాయపర్తి మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం పడింది. వర్ధన్నపేట పట్టణం, దమ్మన్నపేట, రాయపర్తి మండలంలోని సన్నూరు, రాగన్న గూడెం, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం కలగింది.
ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో రైతులు ఆరబోసుకున్న వరి ధాన్యం తడిచి పోయింది. వాన నీటికి ధాన్యం కొట్టుకు పోయే ప్రమాదం ఏర్పడడంతో అన్నదాతలు టెన్షన్ పడ్డారు. ధాన్యంపై టార్పాలి న్లు కప్పి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు.