ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో అన్నీ సమస్యలే..

ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో అన్నీ సమస్యలే..

ఒకప్పుడు విద్యార్థులతో నిండిపోయి, అడ్మిషన్లకు డిమాండ్​ ఉన్న కాలేజీలో ఇప్పుడు సమస్యలు తాండవిస్తున్నాయి. వరంగల్​జిల్లా వర్ధన్నపేట వొంటెల వెంకట రామ నర్సింహారెడ్డి స్మారక ప్రభుత్వ జూనియర్​ కాలేజీ సమస్యలకు నెలవుగా మారింది. క్లాస్​రూమ్​గోడలు, స్లాబ్​లు పగిలి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.

తలుపులు, ఫ్లోరింగ్​ ధ్వంసమై విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ విద్యనభ్యసిస్తున్నారు. నీరు, కరెంట్, ల్యాబ్​రూం కురుస్తోంది. గతంలో కొత్త బిల్డింగ్​కోసం శంకుస్థాపన చేసినా, పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కరించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. – వర్ధన్నపేట, వెలుగు