
వరంగల్ వైద్యుడిపై దాడి ఘటన విషాదాంతం. దాడిలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సుమంత్రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 8రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం(ఫిబ్రవరి 28) అర్థరాత్రి సుమంత్ రెడ్డి చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో రెండు రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా, దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, సామ్యూల్ లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
ఫిబ్రవరి 20 న వరంగల్ లోని భట్టుపల్లి బైపాస్ లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. నిందితులు సామ్యూల్, రాజ్ కుమార్లు మరో వ్యక్తి సుమంత్ రెడ్డిపై రాళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి భార్య ఫ్లోరా మరియా ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.