వరంగల్సిటీ, వెలుగు : నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని వరంగల్ తూర్పు బీజేపీ క్యాండిడేట్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చెప్పారు. నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ బొడ్రాయి, పాపాయిపేట చమన్, వెంకటేశ్వర్ల గుడి, కాకతీయ హాస్పిటల్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు.
స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఉద్యోగాలు లేక యువత, ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కంపెనీల ఏర్పాటులో ప్రజాప్రతినిధులు విఫలం అయ్యారన్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.