తెలంగాణ ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉండాలి : షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా

తెలంగాణ ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉండాలి : షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా

కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు : ఎన్నికల ప్రక్రియపై రాజకీయ నాయకులకు అవగాహన ఉండాలని వరంగల్‌‌ తూర్పు రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌, బల్దియా కమిషనర్‌‌ షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం బల్దియా హెడ్‌‌ ఆఫీస్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. నామినేషన్‌‌ విధానంపై అనుమానులు ఉంటే హెల్ప్‌‌ డెస్క్‌‌ ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. క్యాండిడేట్ల ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదన్నారు. సమావేశంలో అడిషనల్‌‌ కమిషనర్‌‌ అనిసుర్‌‌ రషీద్‌‌, తహసీల్దార్‌‌ ఇక్భాల్‌‌, మాస్టర్‌‌ ట్రైనర్‌‌ సందీప్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు.