గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రైతు పి.అలిపిరి పండించిన 44 బస్తాల దేశీ రకం మిర్చిని సోమవారం ఏనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చాడు.
క్వాలిటీ మంచిగా ఉండడంతో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.40 వేలు పెట్టి కొన్నారు. ఇదే రకం మిర్చి గతేడాది మే నెల చివరలో రూ.95 వేలు పలికింది.