కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నాలుగు రోజులు బంద్ ఉంటుందని మార్కెట్ స్పెషల్సెక్రటరీ నిర్మల సోమవారం( అక్టోబర్ 07) తెలిపారు. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్నవమి, 12న విజయదశమి , 13న పండుగ బంద్ఉంటుందని వెల్లడించారు.
ఆయా రోజుల్లో రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్కు తీసుకొచ్చి ఇబ్బందులకు పడొద్దని సూచించారు. 14న సోమవారం మార్కెట్పునఃప్రారంభిస్తామని తెలిపారు.