ఏనుమాముల మార్కెట్​లో సర్వర్ డౌన్..

  •     ఇబ్బందులు పడుడుతున్న రైతులు 
  •     పట్టించుకోని రైతులు 

వరంగల్ సిటీ, వెలుగు :  వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో నిత్యం సర్వర్ డౌన్ అవుతోంది.  కాంటాలు ఆలస్యం అవుతుండటంతోపాటు ఓ పక్క ఎండ, మరోపక్క దగ్గు, తుమ్ములు, మిర్చి ఘాటుతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు మండుతుండడంతో రైతులు మిర్చి ఘాటుకు ఆయాసపడుతున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన కాంటాలు   11 దాటినా షురూ కావడం లేదు.  

నిత్యం సర్వ డౌన్ ఇబ్బందితో కాంటాలు ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల అనంతరం( శని, ఆదివారాల) సోమవారం ప్రారంభమైన మార్కెట్లో 50వేల బస్తాల మిర్చి మార్కెట్ కు వచ్చింది. పెద్ద మొత్తంలో సరుకు మార్కెట్​కు వస్తందని అధికారులకు సమాచారం

ఉన్నప్పటికీ ఆ మేరకు అప్రమత్తంగా ఉండలేకపోయారు.  నెట్​వర్క్​  ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంగా ఉన్నారు.  దీనిపై అధికారులను వివరణ కోరగా తామేమీ  చేయలేమని, సర్వర్ డౌన్ సమస్య లేకుండా,  మరోసారి పైఅధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.