గురుకులం పాఠశాలల్లో చదువు కోవాల్సిన విద్యార్థులు..వంట పనుల్లో బిజీగా ఉంటున్నారు. తరగతి గదుల్లో ఉండాలిసిన స్టూడెంట్స్.. వంటలు తయారు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. వరంగల్ జిల్లా ఐనవొలు మండలం ఉప్పరపల్లి క్రాస్ దగ్గర ఉన్న జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో గత కొన్ని నెలలుగా విద్యార్థులతో వార్డెన్ శ్వేత, వైస్ ప్రిన్సిపల్ అశోక్ లు వెట్టి చాకిరీ చేస్తున్నట్లు చెబుతున్నారు.
వార్డెన్ విద్యార్థులతో కిచెన్ క్లీనింగ్, పూరీ తయారీతో పాటు, వివిధ పనులు చేయిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్కూల్ పిల్లలతో తమ సొంత కార్లు, బైక్ లను సైతం కడిగిపిస్తున్నట్లుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. విద్యార్థులతో వెట్టి చాకిరీ చేపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ సిబ్బందిపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి.