నేడు సీతంపేటలో బతుకమ్మ సంబురాలు

నేడు సీతంపేటలో బతుకమ్మ సంబురాలు

హసన్‌పర్తి, వెలుగు: తెలంగాణ అంతట బతుకమ్మ పండుగను దసరా ముందు చేసుకోవడం ఆనవాయితీ. వరంగల్అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో మాత్రం ఏటా రెండుసార్లు ఈ పండుగ చేసుకుంటారు. గ్రామంలో నాలుగు వందల నేతకాని కుటుంబాలు చేసుకునే ఈ పండుగ ఊరంతా సందడి నింపుతుంది. వారు దీపావళి నుంచి నాలుగు రోజుల పాటు తమ కులదైవమైన కేదారేశ్వరుడిని స్మరిస్తూ నిర్వహిస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజు ఆదివారం పురుషులు చెరువువద్దకు వెళ్లి రేగడి మట్టిని తీసుకు వచ్చి ఎడ్ల బొమ్మలు తయారు చేశారు. రెండో రోజు సోమవారం ఎడ్ల బొమ్మలను నిమజ్జనం చేశారు. సంబరాల్లో మూడో రోజైన మంగళవారం(నేడు) చెరువు కట్ట వద్ద బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి