డిగ్రీ కాలేజీల్లో ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్‍, వెలుగు : ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే డిగ్రీ కాలేజీల్లో టెంపరరీ విధానంలో క్లాస్‌‌‌‌లు చెప్పేందుకు అర్హులైన వారు అప్లై చేసుకోవాలని రీజినల్‍ కోఆర్డినేటర్‌‌‌‌ మనోహర్‌‌‌‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్‌‌‌‌, పొలిటికల్ సైన్స్‌‌‌‌, హిస్టరీ, మ్యాథ్స్ ఫిజిక్స్‌‌‌‌, కెమిస్ర్టీ, కంప్యూటర్‍ సైన్స్‌‌‌‌, బాటనీ, జువాలజీ, స్టాటిస్టిక్స్‌‌‌‌, కామర్స్‌‌‌‌, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. 

పీజీతో పాటు, పీహెచ్‍డీ, ఎంఫిల్‍, నెట్‌‌‌‌ లేదా సెట్‌‌‌‌ అర్హత కలిగిన వారు ఈ నెల 10 లోగా అప్లికేషన్లను అందించాలని సూచించారు. మెరిట్, డెమో ఆధారంగా సెలక్షన్‌‌‌‌ చేయనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు హనుమకొండ (91541 02713), మహబూబాబాద్‍ (79934 56820), ములుగు (9989991703), భూపాలపల్లి (89856 38218) జనగామ (79934 56814) నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.