యువ టూరిజం క్లబ్ నమోదులో వరంగల్ టాప్-2

యువ టూరిజం క్లబ్ నమోదులో వరంగల్ టాప్-2

వరంగల్, వెలుగు: యువ టూరిజం క్లబ్ నమోదులో వరంగల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సందపపై విద్యార్థులకు అవగాహన కల్పించి, భవిష్యత్తులో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా యువ టూరిజం క్లబ్బుల నమోదు ఎక్కువ సంఖ్యలో చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సత్యశారద పర్యాటక, సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా శుక్రవారం మెమెంటో అందుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరాధరణకు గురైన 14 ఆలయాలను గుర్తించి వాటి పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.