ముషీరాబాద్, వెలుగు : తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా వచ్చే నెల 9న వరంగల్ కేంద్రంగా తెలంగాణ జానపద జాతర నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు చెప్పారు.
కళాకారుల ఉద్యమ గళం విప్పి సినిమా రంగంలోని పెద్ద హీరోల గుత్తాధిపత్యంపై సవాలు చేయనున్నారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సినిమా టీవీ జానపద పరిరక్షణ వేదిక సమావేశం జరిగింది.