
వరంగల్ జిల్లా మమునూరులోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపుతోంది. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోన్న రష్మిక అనే విద్యార్థి ఫిబ్రవరి 26న హాస్టల్ గదిలో ఊరి వేసుకుంది. హాస్టల్ నిర్వాకులు, కాలేజ్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హాస్టల్ గదిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని డెడ్ బాడీని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు ముందు లాస్ట్ ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడిందనే వివరాలను ఆరాదీస్తున్నారు. ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలిస్తున్నారు.