వరంగల్ కాకతీయ యూనివర్సిటీ.. రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్న విద్యార్థులు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ.. రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్న విద్యార్థులు

చదువుకొని బాగుపడండ్రా అంటే ఆహా.. మాకెందుకీ చదువులు. ఎవడికి కావాలి.. ఎంత చదివి ఏం లాభం..కావాల్సింది రెస్పెక్ట్.. రెస్పెక్ట్ కావాలని గొడవలకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. ఈ ఘటన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. 

అసలేం జరిగిందంటే..?

ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తమకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని సెకండ్ ఇయర్ విద్యార్థులు మధ్యాహ్న లంచ్ సమయంలో వారిని కాస్త గట్టిగా హెచ్చరించారు. దాంతో, ఈ గొడవ మొదలైంది. జూనియర్లు అంతా ఒక్కటై సీనియర్లపైకి గొడవకు వెళ్లారు. దాంతో, కాంటీన్ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. అన్నం తినే ప్లాట్లతోనే ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో  ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన యూనివర్సిటీకి చేరుకొని ఇరు వర్గాలను శాంతిపజేశారు. జరిగిన గొడవపై విచారణ చేపట్టి.. కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.