వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికలు వాయిదా?

మరో 3 నెలలు స్పెషల్​ ఆఫీసర్ల పాలన పెట్టేందుకు సర్కార్​ యోచన

ఆ లోపు డివిజన్ల డీలిమిటేషన్​పై కసరత్తు

హైదరాబాద్​, వెలుగు: వరంగల్​, ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికలను మూడు నెలలు వాయిదా వేయాలని రాష్ట్ర సర్కార్​ భావిస్తోంది. అంతవరకు కార్పొరేషన్ల పాలనా బాధ్యత చూసేందుకు స్పెషల్​ ఆఫీసర్లను నియమించాలని యోచిస్తోంది. మార్చి రెండో వారంతో రెండు కార్పొరేషన్ల పాలకమండలళ్ల గడువు ముగియనుంది. ఆ లోపు ఎన్నికలు పెట్టాలంటే జనవరి మూడో వారం నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటిదాకా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

వరంగల్​లో 8, ఖమ్మంలో 10 కొత్త డివిజన్లు!

వరంగల్​, ఖమ్మం ​ కార్పొరేషన్లలో డివిజన్లు పెంచాలన్న డిమాండ్​ వినిపిస్తోంది. దానిపై ఇప్పుడు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో డీలిమిటేషన్​ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్త డివిజన్ల డిమాండ్​ మేరకు ముసాయిదా డివిజన్లను కమిటీ ప్రకటిస్తుంది. ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తుది జాబితాతో కొత్త డివిజన్లను ఏర్పాటు చేస్తారు. వరంగల్​లో ప్రస్తుతం 58 డివిజన్లు ఉండగా, మరో 8 డివిజన్లను.. ఖమ్మంలో 50 ఉండగా, కొత్తగా 10 డివిజన్లు ఏర్పాటు చేయాలని సర్కార్​ యోచిస్తోంది.

ఇవీ చదవండి..

జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే