రోబోలను తయారు చేస్తున్న వరంగల్‍ పిల్లలు

‘హాయ్ .. ఐ యామ్ రోబో’ అంటూ.. ‘రోబో’ మూవీలోసందడి చేసిన రోబో నటనను అంత ఈజీగా మర్చిపోలేం. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేశారు. హీరోయిన్ తో డ్యూయెట్లు, విలన్స్ తో ఫైటింగ్ లాంటి​ సీన్లకు ఫిదా అయ్యారు. స్ర్కీన్ పై రోబోలను చూసి ఆనందించడమే కాదు.. మేమే స్వయంగా రోబోలు తయారు చేస్తామంటున్నారు వరంగల్‍ విద్యార్థులు. ఇలా అంటున్నదిబీటెక్ స్టూడెంట్స్ కాదు.. స్కూల్​ పిల్లలు! చిట్టి చేతులతో పొట్టిరోబోలను తయారు చేస్తున్నారు ఈ బుడతలు.

వరంగల్ చెందిన సుకన్య ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్‍ పూర్తి చేసింది. భర్త ఎన్‍ఐటీలో పిహెచ్ స్కాలర్‌. విద్యారంగంలో సాంకేతికసేవలు అందించాలనే తపన వాళ్లది. ఏ తరహా స్కూల్‍ పెడితే బాగుంటుందని ఆలోచించారు. చదువుకు టెక్నాలజీని జతచేస్తేబాగుంటుందనుకున్నారు. తల్లిదండ్రులు సైన్స్ , మ్యాథ్స్ , ఇంగ్లిషుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వైజ్ఞా నిక అంశాలపై దృష్టి పెట్టడంలేదని తెలుసుకున్నారు. అందుకే ప్రత్యేకంగాసైన్స్ అండ్ ఎలక్ట్రా నిక్స్, రోబో తయారీ లాంటిఆసక్తికర అంశాలతో సిలబస్‍ డిజైన్‍ చేశారు.ఏడాది కిందట ‘క్రియేటివ్‍ రోబోటిక్స్’ ఇని-స్టిట్యూట్‍ నెలకొల్పారు. అనేక సందేహాలమధ్య మొదలైన రోబోటిక్స్ ట్రైనింగ్‍ ఇప్పుడువిజయవంతంగా నడుస్తోంది. ఏడాది వ్యవధిలో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు పలు జాతీయ స్థాయి ఈవెంట్లలోనూ పాల్గొన్నారు.

నిట్‍, వరంగల్‍ టెక్నోజియాన్ సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిట్‍ను ఏర్పాటు చేశారు. గుంటూరులో 2018లో జరిగి న నేషనల్ ఒలంపియాడ్ లో ఏడుగురు బహుమతులు గెలుచుకున్నారు. ఏడాదిలోటెక్స్ట్ బుక్లో ని విషయాలను ప్రాక్కటి ల్ గానేర్పాలన్న లక్ష్యంతో ‘క్రియేటివ్‍ రోబోటిక్స్’పేరుతో శిక్షణా సంస్థ ఏర్పాటైంది. ‘విన-డానికి బాగున్నా ఇది సాధ్యమవుతుందా ’అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రారం-భంలో ‘సిలబస్‍లో లేని ఈ ప్రయోగాలుమాకెందుకు అన్నట్లు ’ పెదవి విరిచారుతల్లిదండ్రులు. ప్రతికూల పరిస్థి తుల మధ్యఇరవై మంది పిల్లలు మాత్రమే జాయిన్​ అయ్యారు. కాని తర్వాత రోబోటిక్స్ శిక్షణ-లో పిల్లలు చేస్తున్న అద్భు తాలు చూసి తల్లి-దండ్రులు ఆశ్చర్యపోయారు. రిమోట్‍ కార్లుకావాలని గోల చేసే పిల్లలు, స్వయంగారిమోట్‍ కార్లు తయారు చేయడం చూసిచాలా సంతోష పడుతున్నారు. దీంతోరోబోటిక్స్ లో శిక్షణ తీసుకునే వారి సంఖ్యక్రమంగా పెరిగిం ది.శిక్షణ ఇలా..ఏడు దశల్లో రోబోటిక్స్ శిక్షణ ఉంటుంది.వారంలో ఒకరోజు చొప్పున ప్రైమరీ పిల్లలకుశిక్షణ ఇస్తారు. రోబోటిక్స్ పై పూర్తి అవగా-హన కల్పిస్తారు. శిక్షణ పూర్తయ్యేసరికిరోబోల తయారీలో విద్యార్థులు పరిణతిసాధిస్తారు. పది సార్లు చదవడం కంటే ఒక్క-సారి రాసింది ఎక్కువ జ్ఞా పకం ఉంటుంది.పుస్తకాల్లో చదివి పరీక్షలో రాసి మార్కులుతెచ్చుకోవడం కంటే చదివిన అంశాలనుప్రాక్టికల్ గా చేసినప్పుడు ఫలితం మెరుగ్గాఉంటుంది. ఈ విషయాన్ని ‘క్రియోటివ్‍ రోబో-టిక్స్’ నిరూపిస్తోంది.