ప్రేమించాలంటు మైనర్‌‌ బాలికపై వేధింపులు.. అరెస్ట్‌

వరంగల్‌: తనను ప్రేమించాలని, లేదంటే చంపేస్తానని మైనర్‌‌ బాలికను బెదిరిస్తున్న విష్ణు అనే యువకుడిని వరంగల్‌లోని ఇంతజార్గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ నగరానికి చెందిన ఒక మైనర్‌‌ బాలికను ర్మాజీపేట గోవిందరాజుల గుట్ట ఏరియాకు చెందిన విష్ణు గత కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోవాలని, లేదంటే చంపేస్తానని వెంటపడుతున్నాడు. దీంతో బాలిక తల్లి ఇంతజార్గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చారు. తనకు, తన కూతురికి విష్ణు నుంచి ప్రాణాపాయం ఉందని అన్నారు. ఇన్నాళ్లు పరువు పోతుందని ఊరుకున్నానని, వేధింపులు ఎక్కువ అవడంతో ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నాని బాధితురాలి తల్లి కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.