దుబాయ్‌‌లో వరంగల్ వాసికి గుండెపోటు అక్కడికక్కడే మృతి

ధర్మసాగర్, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్‌‌ వెళ్లిన వరంగల్‌‌కు చెందిన వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామానికి చెందిన బోనగిరి తిరుమలేశ్​(34) ఏడాది కింద జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడే డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం   గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు.  మృతుడికి తల్లి, భార్య, ఆరేళ్ల కూతురు ఉంది. డెడ్‌‌బాఈ స్వగ్రామానికి చేరుకునేందుకు ఆరు రోజుల సమయం పడుతుందని స్థానికులు చెబుతున్నారు.