
వరంగల్సిటీ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి బస్తాలతో ఎర్రబారింది. శని, ఆదివారాల్లో మార్కెట్ కు సెలవులు రావడంతో సోమవారం రైతులు భారీగా మిర్చి పంటను తీసుకువచ్చారు. ఒక్కరోజే 60 వేల బస్తాలకు పైగా మిర్చి బస్తాలు తెచ్చారు. మిర్చి యార్డుతో పాటు పల్లి, పసుపు, పత్తి యార్డులు, రోడ్లు సైతం మిర్చి బస్తాలతో నిండిపోయాయి. ధర మాత్రం గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.