సమ్మర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను పటిష్టంగా అమలు చేయాలి : గుండు సుధారాణి

కాశీబుగ్గ (కార్పొరేషన్​), వెలుగు : సమ్మర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌కు పటిష్టంగా అమలుచేయాలని బల్దియా మేయర్‌‌‌‌ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో సోమవారం నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. గ్రేటర్​ పరిధిలో నీటి కొరత లేకుండా చూడాలన్నారు.

రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. 15 ఫైనాన్స్‌‌‌‌ కింద కొనసాగుతున్న పనులను స్పీడప్‌‌‌‌ చేయాలని ఆదేశించారు. రివ్యూలో ఆఫీసర్లు శ్రీనివాసరావు, రాజయ్య, సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌, రవికుమార్‌‌‌‌, రవి కిరణ్‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం వరంగల్ సిటీలోని రంగశాయిపేటలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపనకుహాజరై ప్రత్యేక పూజలు చేశారు.