వరంగల్: ఎంజీఎం డాక్టర్ పసునూరి శోభారాణి (40) కరోనాతో మృతి చెందారు. డాక్టర్ శోభారాణి ఏడాదిన్నరగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శోభారాణి మృతి చెందారు. శోభారాణి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ సమీప బంధువు. మరోవైపు ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అధికమవుతున్నాయి. అటు ఆక్సిజన్ల కొరత కూడా ఉందని రోగుల బంధువులు అంటున్నారు.