వరంగల్సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం దవాఖానలో టెక్నికల్ ఇష్యూతో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి కరెంట్ కట్ కావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఓపీతో పాటు ఐసీయూ, ఆర్ఐసీయూ, గుండె జబ్బుల వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఈఎన్టీ, ఆర్థోపెడిక్ వార్డు, పిల్లల వార్డులోని ఎన్ఐసీయూ, పీఐసీయూ విభాగాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ సాయంతో లైట్లు, ఫ్యాన్లు పనిచేయడంతో ఊరట చెందారు. విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో రాత్రి 9 గంటలకు కరెంట్ వచ్చింది.