కరోనాతో ఎంజీఎం ల్యాబ్ టెక్నిషియన్ మృతి

కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనావైరస్ బారినపడి ఎంజీఎంలో ల్యాబ్ టెక్సిషియన్ మృతిచెందాడు. ఎంజీఎంలో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న ఖుర్షీద్ అనే వ్యక్తి కరోనా బారినపడి చనిపోయాడు. సిబ్బందిలో మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సిబ్బంది పరిస్థితే ఇలా ఉంటే.. మామూలు జనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా బాధితులు కోవిడ్ వార్డులో వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సరైన వైద్యం అందక రోగులు నానాయాతన పడుతున్నారు. మెడికల్ కిట్లు లేవని, సరైన వసతులు కలిపించాలని కోరుతూ.. ఎంజీఎంలో పనిచేస్తున్న12 మంది డ్యూటీ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోనే పెద్దదైన ఎంజీఎంలో వసతుల గురించి పట్టించుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

For More News..

96 ఏళ్ల ఓల్డెస్ట్ స్టూడెంట్

పెళ్లయి.. ఒక పిల్లాడు.. అయినా ఇంటర్‌‌‌‌లో టాపర్ గా..

రాఖీ పండుగకు వెళ్తూ అన్న కళ్లెదుటే చెల్లెలి మృతి