రాత్రికి రాత్రే వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేయటం చర్చంశనీయంగా మారింది. అయితే తోటి వైద్యులు, ఉద్యోగులు సహకరించక పోవటం, ప్రజా ప్రతినిదుల ఒత్తడి కారణంగానే శ్రీనివాస్ మనస్థాపానికి గురై రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది.
కోవిడ్ భారిన పడిన రోగులకు వైద్యం అందించటం కోసం ప్రభుత్వం ఎంజీఎం ఆసుపత్రిలో వార్డును ఏర్పాటు చేసింది.అందులో 200 పడుకలను ఏర్పాటు చేసి డాక్టర్లను నియమించింది.కానీ కరోనా భారిన పడిన వారికి వైద్యం అందించటంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని రోగుల నుండి ఆరోపణలు వచ్చాయి . ఎంజీఎంలో కోవిడ్ వార్డులో కనీస సౌకర్యాలు కల్పించక పోవటం,ఆసుపత్రి అస్థవ్యస్థంగా తయారు కావటంతో రోగుల ఇబ్బందులు పడ్డారు. అలాగే ఎంజీఎం ఆసుపత్రికి మందుల కోనుగోలులో సూపరింటెండెంట్ శ్రీనివాస్ అవీనీతికి పాల్పడ్డాడనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. కరోనా రోగులు పలు మార్లు ఆసుపత్రిలో ఆకలి కేకలు పెట్టిన తీరును వీ6- వెలుగు ప్రసారం కూడా చేసింది.
కరోనా రోగులకు వెంటిలేటర్ల సౌకర్యం కల్పించటం కోసం కేంద్రం 48 వెంటిలేటర్లు ,ఐఎమ్ఏ డాక్టర్లు ఇచ్చిన 10 వెంటిలేటర్లు మొత్తంగా 58 వెంటిలేటర్లు పంపించినప్పటికి ఎంజీఎంలోని గదిలోనే భద్రపరిచారు. టెక్నిషియన్ లేడనే సాకుతో ఇప్పటి వరకు అవి నిరుపయోగంగానే ఉన్నాయి. దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదికారులు, ప్రజా ప్రతినిదులు సూపరింటెండెంట్ శ్రీనివాస్ తో సమీక్ష నిర్వహించి మందలించారు. తమకు నిదులు లేవు, రోగులకు సౌకర్యాలు ఏలా కల్పించాలని మంత్రి ఎదుట అవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రోగులకు వైద్యం అందించలేకపోవడం వల్ల ప్రభుత్వం విపలమైందనే ఆరోపణలు వస్తున్నాయని మంత్రి ఘాటుగా మందలించటంతో మన స్థాపానికి గురైన సూపరింటెండెంట్ శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు.
సూపరింటెండెంట్ శ్రీనివాస్ రాజీనామాతో వరంగల్ ఎంజీఎంలో అర్ధో పెడిక్ హెచ్ ఓడీ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్ రావును ఇంచార్జీ సూపరిండెంట్ గా నియమించినట్లుగా తెలుస్తుంది.