వరంగల్‌లో కరోనా విజృంభిస్తోంది. హెల్త్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్తున్నారు. ఇప్పటికే 42 మంది వైద్య విద్యార్థులకు కరోనాసోకింది. తాజాగా ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావుకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్య శ్రీనివాస రావును కలిసిన డాక్టర్లు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
అదేవిధంగా జనగామలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు టీఆర్ఎస్ నేతలే పాటించడం లేదు. కరోనా నిబంధనలు పట్టించుకోకుండా రైతుబంధు వారోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన గత వారం రోజులుగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాలుగు మండలాలలో భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు. ఇటీవల 15వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పాండు.. తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాస్క్ పెట్టుకోలేదు. దీంతో ముత్తిరెడ్డి చుట్టూ తిరిగిన నేతలు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కొందరు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇటీవల జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా మాస్క్ పెట్టుకోలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కరోనా జాగ్రత్తలు పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
For More News..
వీల్‌చైర్ తో గిన్నీస్ రికార్డ్
వామ్మో.. జయమ్మ పంచాయితీ మామూలుగా లేదుగా