ఎంజీఎం సూపరింటెండెంట్ పై వేటు

వరంగల్ ఎంజీఎం ఘటనపై సర్కార్ యాక్షన్ తీసుకుంది. పేషెంట్ పై ఎలుకల దాడి ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. సూపరింటెండెంట్‏ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ అనే పేషెంట్‎ను ఎలుకలు కరవడంతో గాయాలు అయ్యాయి. రోగం నయమవుతుందని హాస్పిటల్లో చేరిస్తే.. ఎలుకల దాడికి ప్రాణాలుపోయే పరిస్థితి వచ్చిందని ఆయన బంధువులు  వాపోయారు. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం బాధ్యులపై వేటు వేసింది.

వరంగల్ ఎంజీఎం ఐసీయూలో ఉన్న శ్రీనివాస్ అనే పేషెంట్ కాలు, చేతులను ఎలుకలు కొరికేయడంతో గాయాలు అయ్యాయి. నాలుగు రోజుల క్రితం భీమారానికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధింత సమస్యతో హాస్పిటల్‎లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్‎లో చేరిన మొదటి రోజే శ్రీనివాస్‎ను ఎలుకలు కరిచాయని, విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు మరోసారి ఎలుకలు శ్రీనివాస్‎ను తీవ్రంగా గాయపరిచాయన్నారు. బాధితుడు శ్రీనివాస్‎కు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 

వరంగల్ ఎంజీఎం ఘటనపై హెల్త్ మినిస్టర్ హరీష్ రావు విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావును సర్కార్ బదిలీ చేసింది. అతని స్థానంలో గతంలో సూపరింటెండెంట్‎గా ఉన్నచంద్రశేఖర్‎కు పూర్తి బాధ్యతలు అప్పగించారు.

For More News..

భారీ సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్‎లోనే 8 సినిమాలు

రూ. 59కే రోజంతా మెట్రోలో ప్రయాణం

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు