ఆరోగ్యంపై విద్యార్థినులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఆరోగ్యంపై విద్యార్థినులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • వరంగల్ ఎంపీ కడియం కావ్య 

వర్దన్నపేట (ఐనవోలు)వెలుగు : విద్యార్థినులు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య సూచించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆరోగ్య కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు.  విద్యార్థినులు థైరాయిడ్, పీసీఓడీ  సమస్యలను ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవకుండా చదువుపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఐనవోలులో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,  కలెక్టర్ ప్రావీణ్య, అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, డీఈవో వాసంతి, డీఎంహెచ్ వో లలితా దేవి, తహసీల్దార్ విక్రమ్, విద్యా, ఆరోగ్య శాఖ అధికారులు  పాల్గొన్నారు.  అనంతరం ఎంపీ కావ్య ఐనవోలు మల్లికార్జున స్వామిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  ముందుగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.