కార్పొరేట్​కు దీటుగా కేజీబీవీలు : కడియం కావ్య

కార్పొరేట్​కు దీటుగా కేజీబీవీలు : కడియం కావ్య
  • వరంగల్ ​ఎంపీ కడియం కావ్య

ధర్మసాగర్(వేలేరు)​, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం విద్యా బోధనలోనూ, వసతుల కల్పనలో కార్పొరేట్ కు దీటుగా కేజీబీవీ పాఠశాలలను నిర్వహిస్తుందని వరంగల్​ఎంపీ కడియం కావ్య అన్నారు. శుక్రవారం వేలేరు మండలం గోళ్ల కిష్టంపల్లిలో రూ.3.25 కోట్లతో నిర్మించనున్న కేజీబీవీ బాలికల జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఎంపీ, స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి శంకుస్థాపన చేశారు. 

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. అనంతరం ఎంపీ విద్యార్థినులతో ముచ్చటించారు. అనంతరం హనుమకొండ జిల్లా వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్​లబ్ధిదారులకు 62,07,192 విలువగల 62 చెక్కులను, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్​రమేశ్, తహసీల్దార్లు సదానందం, కొమి, ఎంపీడీవోలు అనిల్ కుమార్, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.