గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తన విజయానికి కృషి చేసిన సీపీఐ, సీపీఎం పార్టీలకు వరంగల్ ఎంపీ కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ, రాంనగర్‍లోని సీపీఎం ఆఫీసులకు వెళ్లారు. ఇరు పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
నియోజకవర్గంలోని పేదలు, గుడిసెవాసులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో సీపీఐ నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, నేతలు విజయసారథి, నేదునూరి జ్యోతి, కర్రె భిక్షపతి, సీపీఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, నేతలు వాసుదేవరెడ్డి, చుక్కయ్య, ప్రభాకర్‍రెడ్డి తదితరులు పాల్గొన్నారు.